Leading News Portal in Telugu

RK Roja: తప్పు చేయాలంటేనే భయపడేవారు.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు..!


RK Roja: గతంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో.. తప్పు చేయాలంటేనే ఎవరైనా భయపడేవారు.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. ఏపీలో మహిళల రక్షణ చాలా దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. సినీనటి రవళితో కలిసి ఈ రోజు శ్రీవారి దర్శనార్థం తిరుమల విచ్చేసిన రోజా.. వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా.. అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన రోజా.. ఇటీవల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు చూస్తే మహిళల రక్షణ ఏ విధంగా ఉందో అర్థమవుతుందన్నారు.. గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తప్పు చేయాలంటే ఎవరైనా భయపడే వారని.. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు వైసీపీ నుంచి వరుసగా ఎంపీలు, ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయిస్తూ ఉన్న నేపథ్యంలో పార్టీ ఫిరాయిస్తున్న ప్రజా ప్రతినిధులకు ప్రజలలో గౌరవం దక్కదని పేర్కొన్నారు. 2014 నుంచి 2019 వరకు పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధుల పరిస్థితి ఎలా ఉందో గుర్తు చేసుకోవాలంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత ఆర్కే రోజా.

Read Also: Bandla Ganesh: ఏదో మూడ్‌లో ఉండి తిట్టా.. త్రివిక్రమ్‌కు క్షమాపణలు చెబుతున్నా: బండ్ల గణేశ్‌