Leading News Portal in Telugu

AP School Holidays: రేపు ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు..


  • బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుడంంతో ఏపీలో దంచికొడుతున్న వర్షాలు..

  • ఏపీలో భారీ వర్షాలు.. వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష..

  • రేపు రాష్ట్రంలోని అన్ని విద్య సంస్థలకు సెలవు ప్రకటించిన ఏపీ సర్కార్
AP School Holidays: రేపు ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు..

AP School Holidays: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో వాగులు, వంకలు పొర్లుతున్నాయి.. ఈ వరదల దాటికి రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. అటు ఏపీలో భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించి రేపు ( సోమవారం ) విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని ఎడ్యూకేషన్ డిపార్ట్మెంట్ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో కుండపోత వర్షాలు, వరదలకు రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ముందు జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లకు సెలవు ప్రకటించింది.

అయితే, తొలుత ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవు ఇవ్వగా.. తాజాగా సీఎం చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు తప్పనిసరిగా తమ విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలని.. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు, ఏపీలోని వరదలపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బస చేస్తున్న ఆయన.. అధికారులతో సమన్వయం నిర్వహిస్తూ.. ముందుకు సాగుతున్నారు.