Leading News Portal in Telugu

Trains Cancelled: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో 450 రైళ్లు రద్దు..


  • తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో పలు రైళ్లు రద్దు..

  • ఇప్పటి వరకు 450 ట్రైన్స్ ను రద్దు చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే..

  • మరో 140 రైళ్లను దారి మళ్లించిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు..
Trains Cancelled: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో 450 రైళ్లు రద్దు..

Trains Cancelled: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఇప్పటి వరకు 450కి పైగా రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. దీంతో పాటు 140 రైళ్లు దారి మళ్లించగా.. మరో 13 రైళ్లను పాక్షికంగా క్యాన్సిల్ చేసినట్లు వెల్లడించింది. రద్దైన వాటిలో సూపర్‌ఫాస్ట్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతో పాటు పలు పాసింజర్‌ రైళ్లు కూడా ఉన్నాయి. రైల్వే ట్రాక్‌లు పూర్తిగా వరద నీటికి కొట్టుకుపోవడంతో ట్రైన్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

01

02

03

04