Leading News Portal in Telugu

31 Trains Cancelled: మరో 31 రైళ్లు రద్దు.. 13 రైళ్లు దారి మళ్లింపు..


  • ఆంధ్రప్రదేశ్‌.. తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు..

  • పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తున్న దక్షిణ మధ్య రైల్వే..

  • ఇప్పటికే 450 రైళ్లు రద్దు.. తాజాగా మరో 31 ట్రైన్‌లు రద్దు..

  • మరో 13 రైళ్లను దారి మళ్లించిన అధికారులు..
31 Trains Cancelled: మరో 31 రైళ్లు రద్దు.. 13 రైళ్లు దారి మళ్లింపు..

31 Trains Cancelled: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి.. ఈ నేపథ్యంలో.. దక్షిణ మధ్య రైల్వే పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తూ వస్తుంది.. కొన్ని రైళ్లను రద్దు చేస్తే.. మరికొన్ని సర్వీసులను దారి మళ్లిస్తుంది.. ఇంకా కొన్ని రైళ్లను తాతాల్కికంగా రద్దు చేసింది.. అయితే, తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాల కారణంగా ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో450 రైళ్లు రద్దు చేయగా.. తాజాగా మరో 31 ట్రైన్‌లు రద్దు చేసింది సౌత్‌ సెంట్రల్‌ రైల్వే.. ఇక, మరో 13 రైళ్లను దారి మళ్లించారు అధికారులు.. ఇప్పటి వరకు 153 పైగా రైళ్లు దారి మళ్లించగా.. తాత్కాలికంగా 20కి పైగా రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే..

ఇక, విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో సౌత్‌ సెంట్రల్‌ రైల్వే తాజాగా రద్దు చేసిన 31 రైళ్లు.. దారి మళ్లించిన 13 రైళ్ల వివరాలు కింది టేబుల్స్‌లో చూడొచ్చు..

Whatsapp Image 2024 09 02 At 4.43.09 Pm

Whatsapp Image 2024 09 02 At 4.43.21 Pm

Whatsapp Image 2024 09 02 At 4.43.21 Pm