- సహాయక చర్యలకు ఆటంకమనే నేను ఫీల్డ్‌లోకి రాలేదు..
-
వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించాలని నేను అనుకున్నాను.. -
అధికారులు నన్ను సందర్శించవద్దని సూచించారన్న డిప్యూటీ సీఎం.. -
విపత్తు సమయంలో నేను సాయపడాలి.. -
అదనపు బరువు కాకూడదు.. అందుకే నేను క్షేత్రస్థాయిలో పర్యటించలేదన్న పవన్ కల్యాణ్..

Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌ని భారీ వర్షాలు.. వరదుల అతలాకుతలం చేశాయి.. ముఖ్యంగా విజయవాడలో వరదలు బీభత్సం సృష్టించాయి.. ఇప్పటికే బెజవాడలోని అనేక ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి.. అయితే, ఈ సమయంలో.. సహాయక చర్యల్లో విశ్రాంతి లేకుండా పాల్గొంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఇదే సమయంలో.. డిప్యూటీ సీఎం ఎక్కడ? ఆయన సహాయక చర్యల్లో పాల్గొనరా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి.. దానిపై ఈ రోజు క్లారిటీ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిషనర్ కార్యాలయానికి వెళ్లిన ఆయన.. వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.. రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహాయక చర్యలకు ఆటంకమనే నేను ఫీల్డ్‌లోకి రాలేదని స్పష్టం చేశారు.. వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించాలని నేను అనుకున్నాను.. కానీ, అధికారులు నన్ను సందర్శించవద్దని సూచించారు.. ఇది రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్లకు అసౌకర్యాన్ని కలిగిస్తుందన్నారు.. ఇంత విపత్తు సమయంలో నేను సాయపడాలి.. కానీ, అదనపు బరువు కాకూడదు.. అందుకే నేను క్షేత్రస్థాయిలో పర్యటించలేదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
ఇక, మరోవైపు.. వరదల నేపథ్యంలో.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాలయ విరాళం ప్రకటించారు పవన్ కట్యాణ్.. సీఎం సహాయ నిధికి కోటి రూపాయల విరాళం ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రేపు సీఎం చంద్రబాబును కలిసి కోటి రూపాయల విరాళం అందజేయనున్నట్టు వెల్లడించారు.. మరోవైపు.. గత ప్రభుత్వం ఔట్ లెట్స్ మీద దృష్టి పెట్టలేకపోయారు.. వరద తగ్గగానే ఫ్లడ్ కెనాల్స్ ఎలా ఏర్పాటు చేయాలని చర్చిస్తాం అన్నారు.. గత ప్రభుత్వం బుడమేరును పూర్తిగా విస్మరించింది.. గత ప్రభుత్వం సరైన మెయింటెనెన్స్ చేయలేదు.. అన్ని చోట్ల పడ్డ వానలు మనకు ముంపులా వచ్చాయి అని వివరించారు.. విజయవాడపై ప్రత్యేక కోణంలో దృష్టి పెట్టాలన్న ఆయన.. రేపటికి ప్రకాశం బ్యారేజి 5 లక్షలకి తగ్గుతుందని అధికారులు చెపుతున్నారని తెలిపారు. ఇది ఒక ప్రకృతి విపత్తు.. ప్రభుత్వం వచ్చిన కొద్ది నెలలకే ఈ విపత్తు దురదృష్టకరం అన్నారు.. రెండు రోజులుగా పంచాయితీరాజ్ నుంచి ఏర్పాట్లు చేస్తున్నాం.. తెలంగాణ వర్షాలు బుడమేరుకు రావడం నష్టానికి మరో కారణంగా చెప్పుకొచ్చారు.
ప్రభుత్వం నుంచి సహాయక చర్యలు చురుకుగా కొనసాగుతున్నాయి.. 1070, 18004250101, 10704 నంబర్లకు ఫోన్ చేస్తే వెంటనే స్పందిస్తాం అన్నారు డిప్యూటీ సీఎం పవన్.. నిందల కంటే ప్రజలకు ఎలాంట న్యాయం చేయాలనే దానిపై దృష్టి పెడతామన్న ఆయన.. ప్రతీ సిటీకి మాస్టర్ ప్లాన్ చేయాలన్నారు.. ముందస్తుగా ప్రతీ ప్రభుత్వం బాధ్యతగా పని చేయాలి.. స్థానిక మునిసిపాలిటీలు ఇచ్చే అనుమతుల కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..