- బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన పురంధేశ్వరి..
-
వరద బాధితులకు బీజెపీ సంపూర్ణ సహకారం అందిస్తుంది.. -
వరద సహాయ చర్యల్లో కేంద్రం పూర్తి స్థాయి సహకారం అందిస్తోంది: పురంధేశ్వరి

Daggubati Purandeswari: విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీ రాష్ర్ట స్థాయి సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024ను ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి ప్రారంభించారు. నమో యాప్ ద్వారా తొలి సభ్యత్వం తీసుకున్న పురంధేశ్వరి.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏపీలో బీజెపీకి 38 లక్షల సభ్యత్వం వుంది.. మూడు దశల్లో సభ్యత్వ నమోదు తర్వాత పార్టీలో నాయకత్వం మార్పు ఉంటుంది అని తెలిపారు. విజయవాడ వరదల్లో సహాయ చర్యల్లో బీజెపీ నిమగ్నమైంది.. ఇప్పటి వరకు 50 వేల ఆహార ప్యాకెట్లను పంపిణీ చేసింది అని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి, వరద బాధితులకు బీజెపీ సంపూర్ణ సహకారం అందిస్తుంది అని పురంధేశ్వరి పేర్కొనింది.
అలాగే, వరద సహాయ చర్యల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి సహకారం అందిస్తోంది అని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. జాతీయ విపత్తుగా ప్రకటించడానికి కొన్ని నియమ నిబంధనలు వుంటాయి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుకుంటాయి అని ఆమె తెలిపారు.