Leading News Portal in Telugu

Vijayawada Floods: విజయవాడలో మళ్లీ మొదలైన వర్షం


Vijayawada Floods: విజయవాడలో మళ్లీ మొదలైన వర్షం

విజయవాడలో మళ్లీ వర్షం మొదలైంది. ఇప్పటికే బుడమేరు వరద ముంపుతో విజయవాడలోని పలు ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకుపోయాయి. బుడమేరు వరద ముంపు మెల్లగా తొలగిపోతుండటంతో ఇప్పుడిప్పుడే సహాయక చర్యలు ఊపందుకున్నాయి. ఇంకా జక్కంపూడి వైఎస్సార్ కాలనీ, అంబాపురం, సింగ్ నగర్‌లో ఇంకా వరద నీరు నిలిచి ఉంది. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. అయితే వర్షం కురుస్తున్నప్పటికీ వరద బాతులకు సహాయ కార్యక్రమాల్లో ఇటువంటి ఆటంకాలు ఉండకూడదని, వారికి అవసరమైన ఆహారం, తాగునీరు పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. మరీ ముఖ్యంగా ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం.. భారీ వర్షాలు, వరదలతో అత్యంత భయంకర పరిస్థితులను చవి చూశాయి.

 35 Chinna Katha Kaadu Review: 35 చిన్న కథ కాదు రివ్యూ

వరద ప్రాంతాల్లో ఎటు చూసినా చెత్తమయంగా మారింది… కాలనీలో టన్నులకొద్ది పేరుకుపోయిన చెత్త వాటర్ బాటిల్స్ కవర్లో ప్లాస్టిక్ బ్యాగులు చెట్ల కొమ్మలు కాలువలు ఇరుక్కుపోయాయి దీంతో వరద నీరు ఎటు వెళ్లలేనటువంటి పరిస్థితి ఏర్పడింది.. దీనివల్ల ఆయా కాలనీలో రెండు అడుగుల మేర ఇప్పటికీ వరద నీరు చేరి ఉండడానికి ప్రధాన కారణం ఇదే అని చెప్తున్నారు కాలనీ వాసులు.. ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదివేల మందికి పైగా కూడా మున్సిపల్ కార్మికులతో కాలవుల్లో పూడిక తీతా చెత్తాచెదారాలను తొలగించే ప్రక్రియ ప్రారంభించినప్పటికీ అది పూర్తిస్థాయిలో సాగితే కానీ ఈ వరద నీరు పోదని చెప్తున్నారు..

 Simbaa OTT: ఓటీటీలోకి అనసూయ క్రైమ్‌ థ్రిల్లర్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?