Leading News Portal in Telugu

Shivraj Singh Chauhan: ఏపీలో ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించిన కేంద్ర మంత్రి..


  • ముంపు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రమంత్రి పర్యటన..

  • వరద ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించిన శివరాజ్ సింగ్ చౌహాన్..

  • బాధితులకు తగిన న్యాయం చేస్తామని హామీ: కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
Shivraj Singh Chauhan: ఏపీలో ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించిన కేంద్ర మంత్రి..

Shivraj Singh Chauhan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో వరద ముంపు కారణంగా బుడమేరు వాగు పొంగి కేసరపల్లి దగ్గర పంట పొలాలు ముంపుకు గురి కావడంతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా చౌహాన్ కు స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఢిల్లీ రావు, ఎస్పీఆర్ గంగాధర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గబాటి పురంధేశ్వరి, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, యార్లగడ్డ వెంకట్రావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఆ తర్వాత ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించి, రైతులతో అధికారులతో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వరదల వల్ల జరిగిన నష్టానికి తగిన సాయం అందించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇక, పర్యటన తర్వాత ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల పర్యటించనున్నారు శివరాజ్ సింగ్ చౌహాన్.. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి చౌహాన్ తో పాటు బండి సంజయ్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొననున్నారు.