- వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో ఫైర్ అయిన మంత్రి అనగాని సత్యప్రసాద్..
-
జగనే రాష్ట్రానికి ఒక పెద్ద విపత్తు.. -
జగన్ చేసిన మానవ తప్పిదాల వల్లనే వరదలు.. -
వరదల వల్ల పెద్ద ఎత్తున ఆస్తి.. ప్రాణ నష్టం..

Minister Anagani Satya Prasad: ఏపీలో వరదల సమయంలో బురద రాజకీయం నడుస్తోంది.. అయితే, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. జగనే రాష్ర్టానికి ఒక పెద్ద విపత్తుగా పేర్కొన్న ఆయన.. జగన్ చేసిన మానవ తప్పిదాల వల్లనే వరదల వల్ల పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరిగాయన్నారు. ‘మ్యాన్ మేడ్ డిజాస్టర్’లో ఉన్న మ్యాన్ జగన్ రెడ్డే అని దుయ్యబట్టారు.. పోలవరం, వెలిగొండ, పట్టిసీమను పట్టించుకోకపోవడం.. సాగునీటి ప్రాజెక్టులకు తట్ట మట్టి వేయకపోవడం.. జగన్ చేసిన మానవ తప్పిదాలని ఫైర్ అయ్యారు.. 2021లో పింఛ ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి జగన్ ఆధ్వర్యంలో ఇసుక మాఫియానే కారణం అన్నారు.. 2021లో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి 44 మంది చనిపోయి వేలాదిమంది నిరాశ్రయులవడానికి జగన్ ఇసుక మాఫియానే కారణమని ఆరోపించారు..
కనీసం, ప్రాజెక్ట్ గేట్లకు గ్రీజు కూడా పెట్టకుండా జగన్ చేసిన తప్పులే నేడు ప్రజలకు శాపంగా మారాయన్నారు అనగాని.. బుడమేరు కాలువ చుట్టుపక్కల కబ్జాలకు పాల్పడ్డ నాటి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు.. వారి నాయకుడు జగన్ రెడ్డే విజయవాడ వరదలకు కారణమని విమర్శించారు. ఇక, బుడమేరు నుండి వరద నీటిని కృష్ణా నదికి తరలించడానికి 2017-18లో టీడీపీ ప్రభుత్వం 150 కోట్లు ఖర్చు చేస్తే.. అధికారంలోకి రాగానే పనులను ఆపేసి.. ఈనాటి వరద బీభత్సానికి జగన్ రెడ్డినే కారణం అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. కాగా, బెజవాడ వరదలపై అధికార కూటమి.. వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న విషయం విదితమే..