Leading News Portal in Telugu

Budameru: బుడమేరు వద్ద యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీస్ అధికారి


Budameru: బుడమేరు వద్ద యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీస్ అధికారి

Budameru: కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లి బుడమేరు వద్ద యువకుడి ప్రాణాలను ఓ పోలీసు అధికారి కాపాడారు. ఉధృతంగా ప్రవహిస్తున్న బుడమేరు వరద నుంచి యువకుడిని గన్నవరం సీఐ శివప్రసాద్ రక్షించారు. అసలేం జరిగిందంటే.. కేసరపల్లి నుండి కంకిపాడు వెళ్ళే రహదారిలో బుడమేరు వరద ఉధృతి పరిశీలించేందుకు సీఐ శివప్రసాద్ వచ్చారు. అదే సమయంలో కంకిపాడు వెళ్లేందుకు బైక్‌పై ఓ యువకుడు వచ్చాడు. బుడమేరు ప్రమాదంగా ఉంది వెళ్లవద్దని ముందే సీఐ శివప్రసాద్ హెచ్చరించాడు. కానీ ఆయన మాట వినకుండా యువకుడు వెళ్తుండగా.. అతడిని సీఐ వెంబడించారు. కిలోమీటర్‌ మేర అతడిని వెంబడించగా.. ఒకానొక దశలో బుడమేరు ఉధృతికి యువకుడు నీటిలో చిక్కుకోగా.. వెంటనే అతడిని సీఐ రక్షించారు. సీఐ వెంటనే స్పందించడంతో బుడమేరులో కొట్టుకుపోయే ప్రమాదం తప్పింది. అనంతరం ఆ యువకుడు సీఐకి కృతజ్ఞతలు తెలిపారు.