- పిఠాపురంలో పీఆర్ డైరెక్టర్ కృష్ణ తేజ పర్యటన..
-
ముంపు ప్రాంతాలను పరిశీలించిన కృష్ణ తేజ..

PR Director Krishna Teja: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తోన్న కాకినాడ జిల్లా పిఠాపురంలో ముంపు ప్రాంతాలను పరిశీలించారు ఏపీ పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ కృష్ణ తేజ.. పిఠాపురంలోని జగనన్న కాలనీ, సూరంపేట వరద బాధితులకు 25 కేజీల బియ్యం, నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.. ఇక, ఏలేరు జలాశయానికి భారీగా వరద నీరు వస్తుంది.. ప్రమాదకర స్థాయికి చేరుతోంది జలాశయ నీటిమట్టం.. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా ప్రస్తుతం 22.76 టీఎంసీలకు చేరుకుంది నీటిమట్టం.. జలాశయానికి ఇన్‌ఫ్లో రూపంలో 39 వేలు క్యూసెక్కుల పైగా నీరు వచ్చి చేరుతుండగా.. 18700 క్యూసెక్కులు వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.. ఈ సాయంత్రానికి 25వేలు క్యూసెక్కులపైన వరద నీరు దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది.. గొల్లప్రోలులో లోతట్టు ప్రాంతాలు , పలు కాలనీలు జలదిగ్బంధం అయ్యాయి.. జాతీయ రహదారిపైకి సైతం చేరుతుంది వరదనీరు.. మరోవైపు.. చెరువులను తలపిస్తున్నాయి పంట పొలాలు…