Leading News Portal in Telugu

Minister Kollu Ravindra: సహాయక చర్యల్లో గాయపడిన కానిస్టేబుల్‌కు రూ.2 లక్షల ఆర్థిక సాయం


Minister Kollu Ravindra: సహాయక చర్యల్లో గాయపడిన కానిస్టేబుల్‌కు రూ.2 లక్షల ఆర్థిక సాయం

Minister Kollu Ravindra: విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొని, రోడ్డు ప్రమాదంలో గాయపడిన సెబ్‌ కానిస్టేబుల్ మొరు నాగరాజుకు రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. విజయవాడ ఆయుష్ ఆస్పత్రికి వెళ్లి ఐసీయూలో చికిత్స పొందుతున్న నాగరాజును మంత్రి పరామర్శించారు. వైద్యులను అడిగి చికిత్స వివరాలు తెలుసుకున్నారు. నాగరాజు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. వరద బాధితులకు అండగా నిలిచేందుకు వెళ్లి ప్రమాదం బారిన పడడం బాధాకరమన్నారు. గాయపడిన నాగరాజుకు అన్ని రకాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎలాంటి సాయం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని నాగరాజు కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.