- కైలాసగిరి వద్ద పర్యాటకుల బస్సుకు ప్రమాదం
- బ్రేకులు ఫెయిల్ అయ్యి పక్కకు ఒరిగిన బస్సు
- 9 మందికి గాయాలు

Vizag: విశాఖపట్నంలోని కైలాసగిరి వద్ద పర్యాటకుల బస్సు ప్రమాదానికి గురైంది. కైలాసగిరి దిగువన బ్రేకులు ఫెయిల్ అయ్యి ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పింది. బస్సు అదుపుతప్పి పక్కకు ఒరిగి పోవడంతో 9మంది ప్రయాణీకులకు స్వల్పంగా గాయాలయ్యాయి. గాయపడిన హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. తృటిలో పెనుప్రమాదం తప్పడంతో బస్సులో వచ్చిన పర్యాటకులు ఊపిరిపీల్చుకున్నారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను విశాఖ సీపీ శంకబ్రత బాగ్చి పరామర్శించారు.