- జగన్ పై సంచలన మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు
-
అధికారం అండగా జగన్ తన ఇసుక మాఫియా కోసం.. -
అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపేశారు- లోకేశ్ -
ఇదే తరహాలో ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజీ ఢీకొని కూల్చేయాలని ప్లాన్ చేశారు- లోకేశ్.

ప్రకాశం బ్యారేజి గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనపై రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఈ బోట్లను వైసీపీ వాళ్లే కుట్రపూరితంగా వదిలారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో.. మంత్రి నారా లోకేశ్.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ ద్వారా ఆయన విరుచుకుపడ్డారు. ఆయన ట్వీట్ లో.. ‘అధికారం అండగా సైకో జగన్ తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపేశారు. 5 ఊళ్లు నామరూపాలు లేకుండా చేశారు. ఇదే తరహాలో ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజి ఢీకొని కూల్చేయాలని ప్లాన్ చేశారు. విజయవాడతో పాటు పదుల సంఖ్యలో లంక గ్రామాలు నామ రూపాలు లేకుండా చేయాలనుకున్నారు.’ అని తెలిపారు.
అంతేకాకుండా.. ‘లక్షలాది మంది ప్రజలు జల సమాధి అయ్యేలా సైకో జగన్ పన్నిన కుట్ర బట్టబయలైంది. ప్రకాశం బ్యారేజీని పడవలతో కూల్చేయాలనే కుట్ర ప్లాన్ చేసింది సైకో జగన్. ప్లాన్ అమలు చేసింది వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్. తమ కుట్రలు బయటపడకుండా వరద ముంపునకు ప్రభుత్వమే కారణమంటూ విషప్రచారం చేస్తుంది సైకో జగన్ ముఠా.’ అని దుయ్యబట్టారు.