Leading News Portal in Telugu

Dhavaleswaram Barrage: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక..


  • ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

  • బ్యారేజ్ నీటిమట్టం 11.75 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక

  • రానున్న కొద్ది గంటల్లో మరింత పెరుగనున్న గోదావరి వరద.
Dhavaleswaram Barrage: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక..

గోదావరి ఉప్పొంగి ప్రవహించడంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్ నీటిమట్టం 11.75 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ క్రమంలో.. రానున్న కొద్ది గంటల్లో గోదావరి వరద మరింత పెరగనుంది. మరోవైపు.. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి పది లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. రేపు ఉదయానికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. అప్పుడు 12 లక్షల నుండి 13 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేసే అవకాశం ఉంటుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు.

మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో రాజమండ్రి వద్ద లంక గ్రామాల్లోని సుమారు 200 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కోనసీమ జిల్లాలో 30 లంక గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకునే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇరిగేషన్, రెవిన్యూ అధికారులంతా అప్రమత్తమయ్యారు. గోదావరి పరివాహ ప్రాంతంలోని తాసిల్దార్ కార్యాలయాల్లోనూ, రెవిన్యూ డివిజన్ కార్యాలయాలు, కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు.