- ఏపీ మంత్రి సంధ్యారాణికి తృటిలో తప్పిన పెను ప్రమాదం..
-
విజయనగరం జిల్లాలో పేలిన మంత్రి కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనం టైర్.. -
అదుపు తప్పి వ్యాన్‌ను ఢీ కొట్టిన ఎస్కార్ట్ వాహనం.. -
ఐదుగురికి గాయాలు.. ముగ్గురికి సీరియస్..

Minister Sandhyarani: ఏపీ మంత్రి సంధ్యారాణికి తృటిలో పెను ప్రమాదం తప్పిపోయింది.. విజయనగరం జిల్లా రామభద్రపురం సమీపంలోని భూసాయవలస వద్ద మంత్రి సంధ్యారాణి కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం సంభవించింది.. జాతీయ రహదారిపై వెళ్తున్న సమయంలో.. ఎస్కార్టు వాహనం టైరు పేలిపోయింది. దీంతో అదుపు తప్పిన వాహనం.. ఓ వ్యాన్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో వ్యాన్‌లో ఉన్న ముగ్గురుతోపాటు ఇద్దరు గన్‌మెన్లకు.. మొత్తం ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.. ఇక, వెంటనే క్షతగాత్రులను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు మంత్రి సంధ్యారాణి.. మెంటాడ మండలం తమ్మి రాజుపేట గ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.. మెంటాడ మండల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడి తల్లి మరణించడంతో పరామర్శించడానికి బయల్దేరి వెళ్లారు మంత్రి సంధ్యారాణి.. కానీ, భూశాయవలస – ఆరికతోట మధ్యలో మంత్రి కాన్వాయ్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది..