Leading News Portal in Telugu

CM Chandrababu: జాతీయ విపత్తుగా ప్రకటించాలి.. కేంద్ర బృందాన్ని కోరిన సీఎం చంద్రబాబు


  • సీఎం చంద్రబాబుతో కేంద్ర బృందాల భేటీ
  • జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర బృందాలను కోరిన ముఖ్యమంత్రి
CM Chandrababu: జాతీయ విపత్తుగా ప్రకటించాలి.. కేంద్ర బృందాన్ని కోరిన సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఏపీలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందాలు సెక్రటేరియట్‌కు చేరుకుని ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యాయి. గత రెండు రోజుల నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాలు పర్యటించాయి. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని వరద ప్రాంతాల్లో పర్యటించిన సెంట్రల్ టీమ్స్.. వరద నష్టంపై తాము చేపడుతోన్న ఎన్యూమరేషన్ గురించి సీఎం చంద్రబాబుకు వివరించాయి. ఇప్పటికే రూ. 6882 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కేంద్రానికి ఏపీ నివేదిక పంపిన సంగతి తెలిసిందే.

ఏపీలో వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం చంద్రబాబు కేంద్ర బృందాలను కోరారు. పంట నష్టంతో పాటు.. భారీగా ఆస్తి నష్టం జరిగిందనే విషయాన్ని కేంద్ర బృందాలకు సీఎం చంద్రబాబు వివరించారు. భారీ వర్షాలు, వరదలు ఆంధ్రప్రదేశ్‌ని అతలాకుతలం చేశాయి.. విజయవాడ సిటీతో పాటు దాదాపు 400 గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయి.. విజయవాడ సిటీలో మాత్రం దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.. ఇక, ఉత్తరాంధ్రలోనూ వరదలు భారీ నష్టాన్ని మిగిల్చాయి.