Leading News Portal in Telugu

AP Floods Damage: వరదల నష్టం.. తొలిసారి కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ..


  • వరద నష్టంపై తొలిసారి భేటీకానున్న కేబినెట్ సబ్ కమిటీ..

  • మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం..

  • మంత్రులు పయ్యావుల.. అనగాని.. అనిత భేటీ..

  • వరద నష్టం అంచనాలపై సమీక్ష..
AP Floods Damage: వరదల నష్టం.. తొలిసారి కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ..

AP Floods Damage: భారీ వర్షాలు, వరదలు ఆంధ్రప్రదేశ్‌ని అతలాకుతలం చేశాయి.. విజయవాడ సిటీతో పాటు దాదాపు 400 గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయి.. విజయవాడ సిటీలో మాత్రం దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.. ఇక, ఉత్తరాంధ్రలోనూ వరదలు భారీ నష్టాన్ని మిగిల్చాయి.. అయితే, రాష్ట్రంలో వరద నష్టంపై తొలిసారి భేటీకానుంది కేబినెట్ సబ్ కమిటీ… ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు భేటీకానున్నారు మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ, అనగాని ప్రసాద్, వంగలపూడి అనిత. ఇప్పటి వరకు జరిగిన వరద నష్టం అంచనాలపై సమీక్ష నిర్వహించనున్నారు. పంట నష్టం, ఆస్తి నష్టం, ఇళ్ల నష్టం అంచనాలపై చర్చించనుంది కేబినెట్‌ సబ్‌ కమిటీ.. వరద సాయం కింద ఇవ్వాల్సిన ఆర్థిక ప్యాకేజీపై ప్రభుత్వానికి చేయాల్సిన సిఫార్సులపై కూడా చర్చించనున్నారు మంత్రులు. నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ. 10 వేలు ఇస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.. నీట మునిగిన ఇళ్లకు ఏ మేరకు ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలనే అంశంపై సమాలోచనలు చేయనున్నారు కేబినెట్ సబ్ కమిటీ.