Leading News Portal in Telugu

Employees Transfers: ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. బదిలీల గడువు పొడిగించిన సర్కార్..


  • ఉద్యోగుల బదిలీల గడువు మరోసారి పొడిగింపు..

  • సెప్టెంబర్ 22 తేదీ వరకు గడువును పొడిగించిన సర్కార్..

  • సెప్టెంబర్ 23 తేదీ నుంచి బదిలీలపై నిషేధం వర్తిస్తుందంటూ ఉత్తర్వులు..

  • ఎక్సైజ్ శాఖ బదిలీల గడువు సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగింపు..
Employees Transfers: ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. బదిలీల గడువు పొడిగించిన సర్కార్..

Employees Transfers: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఉద్యోగుల బదిలీలు చేపట్టేందుకు గడువును మరోసారి పొడిగించింది.. గతంలో గడువు పొడిగించిన ప్రకారం.. ఈ నెల 15వ తేదీ వరకు బదిలీలపై నిషేధం ఎత్తివేసింది.. అయితే, 16వ తేదీ నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్.. అయితే, ఉద్యోగుల బదిలీల గడువును మరోసారి పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. సెప్టెంబర్ 22 తేదీ వరకు గడువును పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.. ఇక, సెప్టెంబర్ 23 తేదీ నుంచి బదిలీలపై నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది.. ఎక్సైజ్ శాఖ బదిలీల గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది.. అక్టోబర్ 1 తేదీన ఆ శాఖ బదిలీల్లో నిషేధం వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం..

కాగా, బదిలీల్లో గందరగోళ పరిస్థితులు ఉన్నాయనే విమర్శలు వచ్చాయి.. వివిధ శాఖలు బదిలీలతో ఇబ్బందులు పడుతుంటే.. మరికొందరు ఉద్యోగులు.. వివిధ ఉద్యోగ సంఘాలను అడ్డం పెట్టుకుని బదిలీ కాకుండా చూసుకుంటున్నారట.. దాని కోసం ఆయా ఉద్యోగ సంఘాల నుంచి ఆఫీసర్‌ బేరర్స్ లెటర్స్ సంపాదించి.. బదిలీల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారట.. ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి రావడంతో.. ఉద్యోగ సంఘాలకు వార్నింగ్‌ ఇచ్చిన విషయం విదితమే.. తప్పుడు మార్గంలో ఉద్యోగులకు ఆఫీసర్‌ బేరర్స్‌.. ఇతర పోస్టుల్లో ఉన్నట్టు లెటర్స్‌ ఇవ్వొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది.. అయితే, వరదల నేపథ్యంలో.. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వరద సహాయక చర్యల్లో ఉండడంతో.. ఇప్పుడు మరోసారి ఉద్యోగుల బదిలీల గడువును ప్రభుత్వం పొడిగించినట్టుగా తెలుస్తోంది.