Leading News Portal in Telugu

Chittoor District: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి, 30 మందికి గాయాలు


  • చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
  • మొగిలి ఘాట్ దగ్గర రెండు లారీలను ఢీకొన్న బస్సు
  • ఐదుగురు మృతి.. 30 మందికి గాయాలు.
Chittoor District: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి, 30 మందికి గాయాలు

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొగలి ఘాట్ రోడ్ దగ్గర బస్సు బీభత్సం సృష్టించింది. రెండు లారీలను బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 30 మందికి గాయాలయ్యాయి. కాగా.. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పలమనేర్ నుంచి చిత్తూరు వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు పక్క రోడ్లోకి దూసుకెళ్లి 2 లారీలను ఢీకొట్టింది. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలిస్తున్నారు. అయితే.. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా.. నిన్న కూడా తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రహదారిలో కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. కనుమ దారిలో వస్తున్న కారు, బైకును కంటైనర్ లారీ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కంటైనర్ కారుపై పడిపోవడంతో కారులోని నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరికి గాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.