- ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు
- జత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్‌లపై అభియోగాలు

Mumbai Actress Case: ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతి రాణా తాతా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిలను సస్పెండ్ చేస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ముంబయి నటి కాదంబరి జత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్‌లపై అభియోగాలున్నాయి. గత ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతో జత్వానీపై నిబంధనలకు విరుద్దంగా కేసు నమోదు చేశారని అభియోగం నమోదైంది. తమను ఏపీ పోలీసులు వేధించారంటూ విజయవాడ కమిషనరుకు జత్వానీ ఫ్యామిలీ ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే ముగ్గురిని సర్కారు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకేసారి ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసి ఏపీ సర్కార్ సంచలనం సృష్టించింది.