Leading News Portal in Telugu

YSRCP: వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేపట్టిన వైఎస్సార్‌సీపీ..


  • వరద బాధితులకు 50వేల నిత్యావసర సరుకులు పంపిణీ చేపట్టింది వైఎస్సార్‌సీపీ పార్టీ.
  • బుడమేరు వరద ప్రభుత్వ అలసత్వంతో విజయవాడ ప్రజలు అవస్థలు పడ్డారని..
  • మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు..
YSRCP: వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేపట్టిన వైఎస్సార్‌సీపీ..

YSRCP: వరద బాధితులకు 50వేల నిత్యావసర సరుకులు పంపిణీ చేపట్టింది వైఎస్సార్‌సీపీ పార్టీ. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. 33 కార్పొరేషన్ లో ముంపుకు గురయ్యారని., బుడమేరు వరద ప్రభుత్వ అలసత్వంతో విజయవాడ ప్రజలు అవస్థలు పడ్డారని.. మూడు రోజులు వరద నీటిలో ఉండి ప్రజలు పెద్ద అవస్థలు వర్ణనాతీమని., మా పార్టీ కార్యకర్తలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు.

GHMC Office: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు..

జగన్ మోహన్ రెడ్డి కోటి ప్రకటనతో పాలు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశాం. నిత్యవసర సరుకులు ఇవ్వాలని గతంలో నిర్ణయించామని., 50వేల కుటుంబాలకు 7సరుకులతో పంపిణీ చేస్తున్నామని., చంద్రబాబు చెప్పిందే చెపుతాడు.. అబద్దన్నీ పదే పదే చెప్పి నిజం అని నమ్మిస్తాడు.. 2009లో వరదలు వొచ్చినప్పుడు మేము చర్యలు తీసుకున్నాం. అధికారులు, పార్టీ నాయకులకు ముందే వరద వస్తుందని తెలుసని చెప్పారు. వరదలు అర్ధరాత్రి రావు.. అప్పటికప్పుడు రావు.. వరదలపై మోనేటిరింగ్ లేదు.. ప్రతిదీ గత ప్రభుత్వం అంటే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొంది ఎందుకు అని ఆయన ప్రశ్నించారు.

Uttarakhand : మహిళలే టార్గెట్.. దొంగగా మారిన సైనికుడు… విడాకులు కోరిన భార్య

కృష్ణలంక రేటర్నింగ్ వాల్ కట్టడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని., అమరావతిలో 6 రిజర్వాయర్లు కట్టడం ఎందుకు మునగకుండానే కదా.. మేము దిగి పాలు పంచిపెట్టే వరకు పాలు ఇచ్చే నాధుడు లేడు.. నష్టాన్ని అంచనా వేయాలి.. ఒక యూనిఫామ్ పాలసీ తీసుకొని ప్రజలకు నష్ట పరిహారం ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి ఎన్యుమరేషన్ చేయాలని., కానీ.. చేస్తున్న పరిస్థితి నేటికి లేదు. ప్రజలకు పనికొచ్చే కార్యక్రమం ఏది చేసినా స్వాగతిస్తాం అంటూ అయన పేర్కొన్నారు.