Leading News Portal in Telugu

CM Chandrababu: నీరు-చెట్టు పెండింగ్ బిల్లుల విడుదలపై సీఎం ఆదేశం


  • నీరు-చెట్టు పెండింగ్ నిధులను విడుదల చేయాలని సీఎం ఆదేశం
  • ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన మంత్రులు
CM Chandrababu: నీరు-చెట్టు పెండింగ్ బిల్లుల విడుదలపై సీఎం ఆదేశం

CM Chandrababu: నీరు-చెట్టు పెండింగ్ నిధులను విడుదల చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నీరు-చెట్టు పెండింగ్ బిల్లులపై ముఖ్యమంత్రి చంద్రబాబును మంత్రులు పయ్యావుల కేశవ్‌, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్‌లు కలిశారు. ఈ క్రమంలో దీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న నీరు-చెట్టు బిల్లుల విడుదలపై కీలక నిర్ణయం వెలువడింది. పెండింగులో ఉన్న నీరు-చెట్టు నిధుల దఫాల వారీ విడుదల చేయాలని ఆర్థిక శాఖకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. తొలి విడతలో రూ. 259 కోట్ల మేర పెండింగులో ఉన్న నీరు-చెట్టు బిల్లులను విడుదల చేయాలని సీఎం సూచించారు. పెండింగులో ఉన్న మరిన్ని బిల్లులును కూడా త్వరితగతిన దశలవారీగా విడుదలకు నిర్ణయం తీసుకున్నారు.