Leading News Portal in Telugu

Attack on GirlFriend: పెళ్లికి నిరాకరించిందని యువతిపై కత్తితో దాడి


  • నెల్లూరు జిల్లా బంగారక్కపాలెంలో దారుణం
  • పెళ్లికి నిరాకరించిందని యువతిపై కత్తితో దాడి
Attack on GirlFriend: పెళ్లికి నిరాకరించిందని యువతిపై కత్తితో దాడి

Attack on GirlFriend: నెల్లూరు జిల్లా వలేటివారిపాలెం మండలం బంగారక్కపాలెంలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లికి నిరాకరించిందని యువతిపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. రామకృష్ణ అనే యువకుడు ఉద్యోగం చేస్తున్న రమ్య అనే యువతిని గత కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు తెలిసింది. అమ్మపాలెం గ్రామానికి చెందిన రమ్య వెంట తనను ప్రేమించాలని ఎంతో కాలంగా వేధిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తనను పెళ్లి చేసుకోవాలని రమ్యను కోరాడు. రమ్య పెళ్లికి నిరాకరించటంతో ఆమెపై కత్తితో దాడి చేశాడు. అనంతరం తన చేయి కోసుకుని యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితురాలు రమ్య, నిందితుడు రామకృష్ణను కందుకూరు ఏరియా వైద్యశాలకు స్థానికులు తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.