Leading News Portal in Telugu

Thota Trimurthulu: జనసేనలోకి ఎమ్మెల్సీ తోట జంప్..!?


  • జనసేనలో చేరికపై సామినేని ద్వారా ప్రయతిస్తున్న ఎమ్మెల్సీ తోట

  • వరసకి వియ్యంకులుగా ఉన్న తోట త్రిమూర్తులు.. ఉదయ భాను

  • తోట తనతో పాటు వస్తారని జనసేన పెద్దలు దగ్గర ప్రస్తావించిన ఉదయ భాను

  • జనసేన నుంచి రాని క్లారిటీ.
Thota Trimurthulu: జనసేనలోకి ఎమ్మెల్సీ తోట జంప్..!?

ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. సామినేని ఉదయభాను ద్వారా జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తోట త్రిమూర్తులు, సామినేని ఉదయభాను వరుసకు వియ్యంకులు.. తోట త్రిమూర్తులు తనతో పాటు వస్తారని జనసేన పెద్దలకు సామినేని చెప్పినట్లు సమాచారం. అయితే.. తోట చేరికకు జనసేన నుంచి ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతానికి మూడు పార్టీలకు అనుకూలంగా నేతలను చేర్చుకుంటున్నారని సమాచారం. గత వారం జగన్ పిఠాపురం పర్యటనకు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దూరంగా ఉన్నారు. దీంతో.. పార్టీ మారుతారన్న వార్తలు వస్తున్నాయి.

కాగా.. ఇప్పటికే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పార్టీని వీడారు. ఈ క్రమంలో.. బాలినేని ఈరోజు జనసేన అధినేత పవన కల్యాణ్ తో భేటీ అయ్యారు. పార్టీలో చేరికపై చర్చించారు. త్వరలోనే పవన్ కల్యాణ్ సమక్షంలో ఒంగోలులోనే పార్టీలో చేరుతానని బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు.. సామినేని ఉదయభాను కూడా ఈనెల 22న జనసేనలో చేరుతున్నట్లు క్లారిటీ ఇచ్చారు.