Leading News Portal in Telugu

Minister Nara Lokesh: చిత్తూరు జిల్లాను అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటా..


  • చిత్తూరు జిల్లాను సమగ్రాభివృద్ధి చేసి ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటా..

  • బంగారుపాళ్యంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్..
    యువగళం పాదయాత్రలో ప్రజలు తనపై చూపిన అభిమానాన్ని జీవితంలో మరువలేను..
Minister Nara Lokesh: చిత్తూరు జిల్లాను అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటా..

Minister Nara Lokesh: రాబోయే ఐదేళ్లలో చిత్తూరు జిల్లాను సమగ్రాభివృద్ధి చేసి ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటాను అన్నారు మంత్రి నారా లోకేష్‌.. యువగళం 100 కిలో మీటర్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన తొలి హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే గ్రామప్రజల ఆనందోత్సాహాల నడుమ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించారు మంత్రి నారా లోకేష్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువగళం పాదయాత్ర సందర్భంగా జిల్లా ప్రజలు తనపై చూపిన అభిమానాన్ని జీవితంలో మరువలేను అన్నారు.. యువగళాన్ని అడ్డుకునేందుకు ఆరోజున ఇదే బంగారుపాళ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని పోలీసులు ఎంత అరాచకం సృష్టించారో మీరంతా కళ్లారా చూశారు. నా పాదయాత్రను అడ్డుకునేందుకు జీవో 1 విడుదలచేసి, ఇదే బంగారుపాళ్యంలో నా ప్రచారరథాన్ని నాటి పోలీసులు అడ్డుకుని నా గొంతునొక్కాలని విఫలప్రయత్నం చేశారు. కానీ, వారి ప్రయత్నాలు విఫలం అయ్యాయి.. యువగళం దిగ్విజయం అయ్యిందన్నారు.. యువగళం అన్నది నా ఒక్కడి గొంతు కాదు… 5 కోట్ల మంది ప్రజల గొంతుక అని వారికి తర్వాత అర్థమైంది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువగళాన్ని ఆపడం వారి తరం కాలేదని వ్యాఖ్యానించారు మంత్రి నారా లోకేష్‌. కాగా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. తొలిసారి చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు మంత్రి నారా లోకేష్..

యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చడం భాగంగా… రాష్ట్ర మానవ వనరులు, ఐటి, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్.. బంగారుపాలెం మండలం సామాజిక ఆరోగ్య కేంద్రం నందు డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించారు. దీని తో పాటు రెడ్ క్రాస్ సొసైటీ వారు ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్‌ను, నూతనంగా నిర్మించిన ఔట్ పేషెంట్ విభాగంను ప్రారంభించారు. డయాలసిస్ పేషంట్లతో మాట్లాడి వారి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసు కుంటున్నారు లోకేష్.. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద రావు, సెకండరీ హెల్త్ డైరెక్టర్ సిరి, జిల్లా కలెక్టర్ సుమిత కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు, జేసీజీ విద్యాధరి, కంచర్ల శ్రీకాంత్, పూతలపట్టు, పలమనేరు, నగరి, చంద్రగిరి శాసన సభ్యులు కె.మురళి మోహన్, ఎన్.అమరనాథ్ రెడ్డి, జి. భాను ప్రకాష్, పులివర్తి నాని, అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.