Deputy CM Pawan Kalyan: లడ్డూ వివాదంపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్.. కఠిన చర్యలు తప్పవని వార్నింగ్..!
- తిరుమల లడ్డూల వివాదంపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం..
-
తిరుమల లడ్డూల తయారీలో కల్తీ నెయ్యిని వాడుతున్నట్టు తెలిసింది.. -
ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.. -
గత ప్రభుత్వంలోని టీటీడీ బోర్డు దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్..

Deputy CM Pawan Kalyan: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి లడ్డూ ప్రసాదం అంటే భక్తులకు ఎంతో మక్కువ.. అలాంటి లడ్డూ కల్తీ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌ను కాకరేపుతున్నాయి.. అయితే.. తిరుమల లడ్డూల వివాదంపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కీలక వ్యాఖ్యలు చేశారు.. తిరుమల లడ్డూల తయారీలో కల్తీ నెయ్యిని వాడుతున్నట్టు తెలిసింది. ఈ విషయం తెలిసి ఆవేదన చెందాను అన్నారు.. అయితే, ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్.. గత ప్రభుత్వంలోని టీటీడీ బోర్డు దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు..
మరోవైపు, జాతీయ స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్.. ఆలయాలకు సంబంధించిన అంశాల పరిశీలనకు జాతీయ స్థాయిలో ఓ విధానం రూపొందించాలన్నారు.. మఠాధిపతులు.. పీఠాధిపతులతో చర్చించాలి. ఆలయాల రక్షణపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని సచించారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..