Leading News Portal in Telugu

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. – NTV Telugu


  • శ్రీవారి భక్తులకు అలర్ట్..

  • నేడు డిసెంబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షణ టోకెన్లు విడుదల..

  • ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్లు విడుదల..
    వయోవృద్ధులు.. వికలాంగులకు సంబంధించిన దర్శన టిక్కెట్ల కోటా విడుదల..
TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్..

TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చేసింది.. ఈ రోజు, రేపు వివిధ సేవలకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ.. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో డిసెంబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చేయనున్నారు.. ఇక, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్లు విడుదల చేయనుంది టీటీడీ.. మరోవైపు.. మధ్యహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగులకు సంబంధించిన దర్శన టిక్కెట్ల కోటాను విడుదల చేయనున్నారు..

మరోవైపు.. రేపు ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు.. ఇక, రేపు మధ్యహ్నం 3 గంటలకు వసతి గదులు కోటాను విడుద చేయనున్నారు.. ఇక, శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం ప్రారంభమైంది.. శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగాని ప్రారంభించామని ఈవో ఇఓ శ్యామలరావు వెల్లడించారు.. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు శాంతి యాగాని నిర్వహిస్తాం.. 8 మంది అర్చకులు, ముగ్గురు ఆగమ పండితులు ఆధ్వర్యంలో యాగాని నిర్వహిస్తున్నాం అన్నారు.. చివరగా అన్నప్రసాద పోటులో.. లడ్డూ ప్రసాద పోటులో సంప్రోక్షణ నిర్వహిస్తామని పేర్కొన్నారు.. ఇక, తిరుమలలో భక్తుల రద్దీతగ్గింది.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండానే నేరుగా శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు భక్తులు.. నిన్న శ్రీవారిని 82,436 మంది భక్తులు దర్శించుకోగా.. 25,437 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.. హుండీ ఆదాయం రూ.4.57 కోట్లుగా ప్రకటించింది టీటీడీ.