Leading News Portal in Telugu

Minister Nadendla Manohar: పవన్ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా మహాయాగం


  • పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా మహాయాగం
  • మహాయాగంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్
Minister Nadendla Manohar: పవన్ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా మహాయాగం

Minister Nadendla Manohar: తిరుమల లడ్డు కల్తీ ఘటనను నిరసిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా తెనాలి వైకుంఠ‌పురం దేవస్థానంలో తలపెట్టిన మ‌హాయాగంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. గత పాలకులకు తిరుపతి దేవస్థానం టికెట్లు అమ్ముకునే శ్రద్ధ, లడ్డు తయారీపై లేదని విమర్శించారు. ప్రధాన దేవాలయాల్లో సంప్రోక్షణ యాగాలు చేయ్యాలని దేవాదాయ శాఖ ఆదేశాలతో తెనాలి వైకుంఠ‌పురంలో మహా యాగం నిర్వహించామన్నారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తలపెట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా మహా యాగం చేపట్టామన్నారు. వందల ఏళ్ళ నుంచి స్వామివారికి లడ్డు రూపంలో అందించే మహా ప్రసాదం కోట్లాది భక్తులు భక్తి భావంతో హృదయానికి అద్దుకొని స్వీకరిస్తారన్నారు. మన పూర్వీకులు లడ్డు ద్వారా మన సంస్కృతి ధర్మంతో అందించటం జరిగిందన్నారు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందన్నారు. తిరుమల దేవస్థానం విషయంలో కేవలం అహంకారంతో చేసిన పనులను, పాలకులు స్వార్థాల కోసం ఆలయాలను ఉపయోగించుకుంటున్నారన్నారు.