Leading News Portal in Telugu

YS Jagan: లడ్డూ వివాదం వేళ కీలక నిర్ణయం.. ఈ నెల 28న తిరుమలకు జగన్


  • లడ్డూ వివాదం వేళ మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం
  • రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 28న ఆలయాల్లో పూజలకు జగన్‌ పిలుపు
  • ఈ నెల 28న తిరుమలకు జగన్
YS Jagan: లడ్డూ వివాదం వేళ కీలక నిర్ణయం.. ఈ నెల 28న తిరుమలకు జగన్

YS Jagan: ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తిరుపతి లడ్డు, వెంకన్న విశిష్టతను అపవిత్రం చేశారని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ విమర్శించారు. చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలకు జగన్‌ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 28న శనివారం పూజల్లో పాల్గొనాలని జగన్‌ పిలుపునిచ్చారు. మరోవైపు ఈ నెల 28న మాజీ సీఎం జగన్‌ తిరుమలలో స్వామివారిని దర్శించుకోనున్నారు. లడ్డూ వివాదంపై మాట్లాడుతూ.. కల్తీ జరగకుండానే జరిగిందని చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. రాజకీయ దుర్భుద్ధితోనే చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారని వైఎస్‌ జగన్‌ ఎక్స్ వేదికగా నిలదీశారు.

వైఎస్‌ జగన్ ఎక్స్ వేదికగా.. “తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, వెంకటేశ్వరస్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను, రాజకీయ దుర్బుద్ధితో, కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుగారు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు, చంద్రబాబుగారు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28, శనివారంరోజున పూజల్లో పాల్గొనాలని వైయస్సార్‌సీపీ పిలుపునిస్తోంది.” అని జగన్ పేర్కొన్నారు.