- వివిధ శాఖల ఇవాళ సీఎం చంద్రబాబు సమీక్ష..
-
క్రీడా.. యువజన సర్వీసులపై సమీక్షించనున్న చంద్రబాబు.. -
యూత్ పావసీ రూపకల్పనపై దిశా నిర్దేశం చేయనున్న సీఎం.. -
ఇండస్ట్రియల్ పాలసీ రూపకల్పనపై సమీక్ష.. -
కొత్తగా ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రీయల్ పార్కులపై చర్చ..

CM Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ శాఖల ఈ రోజు కీలక సమీక్షలు నిర్వహించనున్నారు.. క్రీడా, యువజన సర్వీసులపై సమీక్షించనున్నారు సీఎం చంద్రబాబు. యువతకు ఉపాధి, పారిశ్రామిక రంగంలో.. యువతకు ప్రోత్సాహం, యువతకు ప్రొత్సాహం ఇచ్చేలా స్టార్టప్ కంపెనీల ఏర్పాటుపై చర్చించనున్నారు.. యూత్ పావసీ రూపకల్పనపై దిశా నిర్దేశం చేయనున్నారు సీఎం చంద్రబాబు.. గ్రామీణ క్రీడలకు ప్రోత్సాహం, స్టేడియంల అభివృద్ధి, గత ప్రభుత్వ హయాంలో క్రీడా శాఖలో అవినీతి వంటి అంశాలపై కూడా దృష్టిసారించనున్నట్టుగా తెలుస్తోంది.. మరోవైపు.. ఇండస్ట్రియల్ పాలసీ రూపకల్పనపై కూడా సమీక్షించనున్నారు సీఎం చంద్రబాబు… కొత్తగా ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రీయల్ పార్కులపై చర్చ సాగనుంది.. పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిపై సమీక్షించబోతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కాగా, నిత్యం ఏదో శాఖపై వరుసగా సమావేశాలు, సమీక్షలను సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహిస్తోన్న విషయం విదితమే..