- అక్టోబర్ 1 నుంచి 3వ తేదీ వరకు తిరుమల తిరుపతిలోనే పవన్ కళ్యాణ్..
-
గత ప్రభుత్వ హాయంలో జరిగిన అపచారాలకు పవన్ దీక్ష చేస్తున్నారు.. -
పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు అందరు మద్దతు ఇవ్వాలి: ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు

Arani Srinivasulu: తిరుపతిలో జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరయ్యారు. జనసేన అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటన విజయవంతంపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రాయశ్చిత్తం దీక్ష విరమణకు విచ్చేస్తున్న పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు తిరుపతి, తిరుమలలో పర్యటిస్తారు అని తెలిపారు. ఇక, 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి పవన్ చేరుకోనున్నారు. రాత్రి తిరుమలకు చేరుకుంటారు అని ఆయన చెప్పారు. రెండవ తేదీన తిరుమలలోని ప్రధాన ప్రాంతాలను డిప్యూటీ సీఎం పరిశీలిస్తారు.. అక్టోబర్ 3వ తేదీన తిరుపతిలో జరిగే వారాహి సభలో పవన్ పాల్గొంటారు అని ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు వెల్లడించారు.
ఇక, వారాహి సభను విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని జనసేన ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు చెప్పారు. తిరుమల లడ్డూ ప్రసాదాల కల్తీకి గత ప్రభుత్వం అపచారానికి పాలపడింది అన్నారు. గత ప్రభుత్వ అపచారాలకు ప్రాయచ్చిత్తం కోరుతూ పవన్ కళ్యాణ్ దీక్ష చేశారు అని ఆయన వెల్లడించారు. పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా 30వ తేదీ అన్ని దేవాలయాల్లో దీపాలు వెలిగించాలి.. అక్టోబర్ 1వ తేదీన ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఆలయాలు, యోగ కేంద్రాల్లో నిర్వహించాలి అని కోరారు. అక్టోబర్ 2న నగర సంకీర్తన.. అలాగే, అక్టోబర్ 3న ఆలయాల్లో భజన కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా నిలవాలని అరణి శ్రీనివాసులు కోరారు.