Leading News Portal in Telugu

Bomb Blast: నిద్రిస్తున్న వీఆర్‌ఏ.. మంచం కింద బాంబులుపెట్టిన పేల్చి చంపేశారు..!


  • కడప జిల్లాలో దారుణం..

  • నిద్రిస్తున్న వీఆర్‌ఏ మంచం కింద బాంబులు పేల్చిన దుండగులు..

  • వీఆర్ఏ మృతి.. ఆయన భార్యకు తీవ్రగాయాలు..
Bomb Blast: నిద్రిస్తున్న వీఆర్‌ఏ.. మంచం కింద బాంబులుపెట్టిన పేల్చి చంపేశారు..!

Bomb Blast: కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.. నిద్రిస్తున్న వీఆర్‌ఏ మంచం కింద బాంబులు పెట్టి పేల్చారు గుర్తుతెలియని వ్యక్తులు.. ఈ ఘటనలో వీఆర్‌ఏ ప్రాణాలు కోల్పోగా.. ఆయన భార్య తీవ్రగాయాలపాలయ్యారు.. ఇక, వీఆర్‌ఏ ఇల్లు పూర్తిగా ధ్వంసం అయినట్టుగా చెబుతున్నారు.. ఈ దారుణానికి పాతపక్ష్యలే కారణంగా అనుమానిస్తున్నారు..

కడప జిల్లా వేముల మండలంలోని వేముల కొత్తపల్లిలో జరిగిన బాంబు పేలుళ్లకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గ్రామ వీఆర్ఏ ఇంట్లో బాంబులు పేల్చారు గుర్తు తెలియని దుండగులు… ఆరుబయట వీఆర్‌ఏ నరసింహులు నిద్రిస్తుండగా.. ఆయన మంచం కింద జిలేటిన్ స్టిక్స్ పెట్టి పేల్చారు.. గ్రామ వీఆర్ఏ నరసింహులు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆయన భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి.. ఈ ఘటనలో వీఆర్ఏ ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయినట్టు చెబుతున్నారు. పాత కక్షలే హత్యకు కారణంగా భావిస్తున్నారు పోలీసులు.. అనుమానితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది.. ఇక, మృతి చెందిన వీఆర్ఏ మృతదేహాన్ని వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

అయితే, బాబు అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తోంది మృతుడి కూతురు పుష్పావతి.. మా అమ్మ.. బాబుతో మాట్లాడలేదన్న కసితోనే మా నాన్నను చంపాడు.. గతంలో కూడా మా నాన్నను చంపేందుకు బాబు ప్రయత్నం చేశాడని పేర్కొన్నారు.. బాబు కుటుంబానికి.. మా కుటుంబానికి మధ్య గతంలో గొడవలు జరిగాయి.. రాత్రి మా అమ్మానాన్న నిద్రిస్తున్న సమయంలో కరెంటు తీసి.. బాంబులు పెట్టి.. మా నాన్నను బాబు చంపాడని ఆరోపించించారు వీఆర్ఏ నరసింహ కూతురు పుష్పావతి.