Leading News Portal in Telugu

YS Jagan Punganur Visit Cancelled: వైఎస్ జగన్ పుంగనూరు పర్యటన రద్దు.. పెద్దిరెడ్డి ప్రకటన


  • వైఎస్‌ జగన్‌ పుంగనూరు పర్యటన రద్దు..

  • మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి..
YS Jagan Punganur Visit Cancelled: వైఎస్ జగన్ పుంగనూరు పర్యటన రద్దు.. పెద్దిరెడ్డి ప్రకటన

YS Jagan Punganur Visit Cancelled: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పుంగనూరు పర్యటన రద్దు చేసుకున్నట్టు వెల్లడించారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. చిన్నారి అశ్వియ అంజూమ్‌ హత్య నేపథ్‌యంలో.. ఈ నెల 9వ తేదీన అశ్వియ అంజూమ్‌ కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు పుంగనూరు పర్యటనకు సిద్ధమయ్యారు వైఎస్‌ జగన్‌.. అయితే, జగన్‌ పర్యటన రద్దు చేసుకున్నట్టు ఈ రోజు వెల్లడించారు పెద్దిరెడ్డి.. చిన్నారి మృతి అందరినీ కలచి వేసిందన్న ఆయన.. కర్నూలులో లాగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే జగన్‌ పుంగనూరు రావాలనుకున్నారు.. అయితే, వైఎస్ జగన్ పర్యటన అనగానే హడావిడిగా ముగ్గురు మంత్రులు పుంగనూరులో పర్యటించారు.. పోలీసులు కూడా ముగ్గురు దోషులను అరెస్టు చూపించారని.. వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం.. ఈ నేపథ్యంలోనే పుంగనూరు పర్యటనను వైఎస్‌ జగన్‌ రద్దు చేసుకున్నట్టు వెల్లడించారు..

ఇక, ఇదే శ్రద్ధ కర్నూలు ఘటన జరిగినప్పుడు చూపించి ఉంటే ఆ అమ్మాయి ఆచూకీ లభించేది అన్నారు పెద్దిరెడ్డి.. మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తే ఇక రాష్ట్రంలో చర్చ మొదలవుతుందని పుంగనూరు ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించింది.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి అని ఆరోపించారు.. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ప్రభుత్వమే దాడులకు ప్రేరేపిస్తుందన్నారు.. ఇవన్నీ పక్కన బెట్టి ప్రజలు సంక్షేమం అందిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కాగా, చిత్తూరు జిల్లా పుంగనూరులో గత నెల 29వ తేదీన మైనర్‌ బాలిక అదృశ్యం కేసు కలకలం సృష్టించింది.. రెండు రోజుల పాటు బాలిక కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది.. చివరికి ఈ నెల 2న పుంగనూరులోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో బాలిక మృతదేహం బయటపడింది. కానీ, పోలీసులు విచారణలో జాప్యం చేస్తూ వచ్చారని.. ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శలు వచ్చాయి.. ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ పుంగనూరు పర్యటనకు సిద్ధం కావడం.. మరోవైపు.. నిందితులను అరెస్ట్‌ చేయడంతో తన పర్యటనను రద్దు చేసుకున్నారు వైఎస్ జగన్.