Leading News Portal in Telugu

Drone Summit 2024: ఆకాశంలో అద్భుతం.. కృష్ణా తీరంలో 5,500 డ్రోన్లతో అతిపెద్ద డ్రోన్‌ షో


  • పున్నమి ఘాట్‌లో అతిపెద్ద డ్రోన్‌ షో
  • కృష్ణా నది తీరంలో 5500 డ్రోన్‌లతో భారీ ప్రదర్శన
  • డ్రోన్‌ షోతో పాటు లేజర్‌ షో
  • డ్రోన్‌ లైటింగ్‌ ద్వారా ఆకాశంలో వివిధ ఆకృతుల ప్రదర్శన
  • హాజరైన సీఎం చంద్రబాబు..కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
  • డ్రోన్‌ షోకు భారీగా తరలివచ్చిన సందర్శకులు.
Drone Summit 2024: ఆకాశంలో అద్భుతం.. కృష్ణా తీరంలో 5,500 డ్రోన్లతో అతిపెద్ద డ్రోన్‌ షో

Drone Summit 2024: విజయవాడలోని కృష్ణా తీరంలో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. జాతీయ డ్రోన్‌ సమ్మిట్‌లో భాగంగా పున్నమి ఘాట్‌లో అతిపెద్ద డ్రోన్‌ షోను సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు ప్రారంభించారు. కృష్ణా నది తీరంలో 5,500 డ్రోన్‌లతో భారీ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. డ్రోన్‌ షోతో పాటు లేజర్‌ షోను ఏర్పాటు చేశారు. డ్రోన్‌ షోను వీక్షించేలా ఐదు చోట్ల డిస్‌ప్లేలను ఏర్పాటు చేశారు. డ్రోన్ షోతోపాటు లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రదర్శనను తిలకించేందుకు కృష్ణా తీరానికి భారీగా సందర్శకులు తరలివచ్చారు. కృష్ణా తీరమంతా సందర్శకులతో నిండిపోయింది. రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఈ డ్రోన్‌ షోకు హాజరయ్యారు. డ్రోన్‌ హ్యాకథాన్‌లో విజేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా చెక్కులు అందజేశారు. డ్రోన్ సిటీకి 300 ఎకరాలు కేటాయించారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. రీసెర్చ్, డెవలప్మెంట్ కోసం సివిల్ ఏవియేషన్ నుంచీ సపోర్టు ఇస్తామన్నారు. దేశం డ్రోన్ టెక్నాలజీకి బేస్ కావాలన్న మా ఆలోచనని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారని ఆయన స్పష్టం చేశారు.

https://www.youtube.com/watch?v=Y-h9C9t94yo