- మానవత్వం చాటుకున్న మంత్రి గొట్టిపాటి..
-
త్రోవగుంట ఫ్లై ఓవర్ పై ఓ ప్రమాదం.. -
తీవ్ర గాయాలపాలైన వ్యక్తిని దగ్గరుండి ఆస్పత్రికి తరలించిన మంత్రి..

Minister Gottipati Ravi Kumar: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మానవత్వం చాటుకున్నారు. మంత్రి రవి కుమార్.. చిలకలూరిపేటలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి ఒంగోలు వెళ్తున్నారు.. ఒంగోలులో జరిగే జెడ్పీ సమావేశానికి మంత్రి గొట్టిపాటి వెళ్తున్న సమయంలో త్రోవగుంట ఫ్లై ఓవర్ పై ఓ ప్రమాదం జరిగింది.. బైక్‌పై వెళ్తున్న ఓ యువకుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.. ఈ ఘటనలో బైకిస్టు తీవ్రగాయాలపాలయ్యాడు.. ఇక, అటుగా వెళ్తున్న మంత్రి గొట్టిపాటి.. తీవ్రగాయాలపాలైన ఆ వ్యక్తిని చూసి.. తన కాన్వాయ్ ఆపారు.. తీవ్రగాయాలైన వ్యక్తిని దగ్గరుండి అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడు బల్లికురవ మండలం అంబడిపూడికి చెందిన కొవ్వూరి కోటేశ్వరరావుగా గుర్తించారు. కోటేశ్వరరావుకు ఒంగోలు కిమ్స్ తరలించారు. మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి సిబ్బందిని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు.