Bride who Run Away from the wedding hall yesterday and today appeared in the police station with her boyfriend
- కొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా పరారీ..
-
వధువు వెళ్లిపోవడంతో నిలిచిపోయిన పెళ్లి.. -
ప్రియుడిని పెళ్లి చేసుకున్న యువతి.. -
నేడు ప్రియుడితో కలిసి పత్తికొండ పీఎస్ లో ప్రత్యక్షం..

Pattikonda Love Story: కర్నూలు జిల్లా పత్తికొండలో శుక్రవారం తెల్లవారుజామున అదృశ్యమైన పెళ్లికూతురు ఈ రోజు తన ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమైంది.. పత్తికొండలోని గోపాల్ ప్లాజాలో కొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. కన్పించకుండా పోయింది పెళ్లి కూతురు వైష్ణవి.. ఆమె ఓ యువకుడితో వెళ్లిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.. అయితే, ప్రియుడు విశ్వాస్ ని పెళ్లి చేసుకున్న వైష్ణవి.. ఇవాళ పత్తికొండ పీఎస్ లో ప్రత్యక్షమైంది.. తాను పెళ్లి చేసుకున్న విశ్వాస్‌ని వెంటపెట్టుకుని పోలీస్ స్టేషన్‌కు వచ్చింది.. ఇక, వైష్ణవి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో ఆమెను ప్రశ్నిస్తున్నారు పోలీసులు.
కాగా, అనంతపురానికి చెందిన నరేంద్ర కుమార్ కుమార్తె వైష్ణవికి, కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామానికి చెందిన బజారి కుమారుడుకి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. తెల్లవారితే పెళ్లి , రాత్రి సంప్రదాయాల ప్రకారం చిన్నతంబులం,పెద్ద తాంబూలం కూడా చేశారు. అయితే అమ్మాయికి ఇష్టం లేకపోవడంతో.. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో.. పత్తికొండలోని గోపాల్ ప్లాజా కళ్యాణ మండపం నుండి గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోయింది. దీంతో.. మరికొన్ని గంటలలో జరగాల్సిన పెళ్లి నిలిచిపోయింది. పెళ్లి నిలిచిపోవడంతో పత్తికొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు వధువు తండ్రి.. అయితే, తెల్లవారుజామున 4 గంటలకు కళ్యాణ మండపం నుండి ఒక అబ్బాయితో బైక్ పై వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయిన విషయం విదితమే..