- మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సంచలన వ్యాఖ్యలు
- తనపై విచారణ చేయించమని ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే

MLA Brahmananda Reddy: మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై, ముఖ్యమంత్రి విచారణ చేయించాలని కోరారు. తప్పు చేసి ఉంటే తనను శిక్షించాలని ఆయన అన్నారు. బదిలీలు జరిగే చాలామంది ఉద్యోగులు తన నియోజకవర్గానికి వచ్చారని.. ఎవరి దగ్గరైనా నేను ఒక రూపాయి తీసుకున్నానేమో వాళ్లు చెప్పాలన్నారు. ఒకరి దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదన్నారు.
గ్రానైట్ వ్యాపారుల నుంచి నెలకు రెండు కోట్లు ఇస్తామన్నా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదన్నారు. నిజాయితీగా ఉన్నానన్నారు. అయినా కొంత మంది నాపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఆ దుష్ప్రచారం వెనుక కుట్ర దారులు ఎవరో తేలాలన్నారు. అందుకే తనపై విచారణ చేయించమని ప్రభుత్వాన్ని కోరుతున్నానని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు.