Leading News Portal in Telugu

TDP MLA Gummanur Jayaram appealed to District Collector Vinod Kumar


  • నా పేరు చెప్పి కొందరు భూ కబ్జాలు చేస్తున్నారు..

  • వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలి..

  • కలెక్టర్ కు గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం విజ్ఞప్తి..
Gummanur Jayaram: నా పేరు చెప్పి కబ్జాలు చేస్తున్నారు.. కలెక్టర్‌కు ఎమ్మెల్యే ఫిర్యాదు

Gummanur Jayaram: నా పేరు చెప్పి కబ్జాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం.. తన పేరు చెప్పి కొందరు భూ కబ్జాలు చేస్తున్నారని, అటువంటి వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం.. సోమవారం రోజు.. ‘ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ వినోద్‌ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ‘నా పేరు చెప్పి కొందరు భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. వారి వల్ల నా ఇమేజ్‌కు బురద అంటుతోంది. అలాంటివారిపై దృష్టి సారించి చర్యలు తీసుకోండి’ అని జయరాం తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో చాలామంది ఇళ్లు నిర్మించుకోకుండా ఖాళీగా పెట్టారు. వారిలో అనర్హులను గుర్తించి ఇళ్ల పట్టాలు రద్దు చేయాలి. అర్హులకు ఆ స్థలాలు ఇవ్వాలి అని కూడా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్‌కు విజ్ఞప్తి చేశారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం..