Leading News Portal in Telugu

Union Minister Bandi Sanjay Kumar at Rozgar Mela in Vizag


  • విశాఖలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటన..

  • పగలు.. పట్టింపులు.. శత్రుశ్వాలు పక్కనబెట్టి..

  • అన్ని రాజకీయ పార్టీలు ఏపీ అభివృద్ధికి సహకరించాలని పిలుపు
Union Minister Bandi Sanjay: పగలు, పట్టింపులు పక్కనబెట్టి ఏపీ అభివృద్ధికి సహకరించాలి..

Union Minister Bandi Sanjay: పగలు, పట్టింపులు, శత్రుశ్వాలు పక్కనబెట్టి అన్ని రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌.. విశాఖపట్నంలో పర్యటిస్తున్న ఆయన.. VMRDA ఎరీనలో ప్రధాన మంత్రి రోజ్ గార్ మేళా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.. పోస్టల్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు బండి సంజయ్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల వరకే రాజకీయాలు.. ఆ తర్వాత రాష్ట్రాల అభివృద్ధి లక్ష్యంగా కేంద్రం పనిచేస్తుందన్నారు.. ఆంధ్రప్రదేశ్ కు అన్ని విధాలుగా కేంద్రం సహకరిస్తుంది.. జనదన్ ఖాతాల వల్ల కేంద్రం విడుదల చేసే ప్రతీ రూపాయి పేదల చేతుల్లోకి వెళ్తున్నాయని వెల్లడించారు.. నిత్యావసర వస్తువులు ఎగుమతి చేసే స్థాయికి భారత్ దేశం ఎదిగింది.. శక్తివంతమైన భారత దేశ నిర్మాణం కోసం రోజ్ గార్ మేళాలో అపాయింట్ మెంట్ లెటర్స్ పొందినవాళ్లు పనిచేయాలని పిలుపునిచ్చారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌. కాగా, దేశవ్యాప్తంగా రాజ్ గార్ మేళాను నిర్వహిస్తుంది కేంద్ర ప్రభుత్వం.. ప్రధాని నరేంద్ర మోడీ సహా ఎక్కడిక్కడి కేంద్ర మంత్రులు ఆయా రాష్ట్రాల్లో ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయిన విషయం విదితమే..