Leading News Portal in Telugu

High Court granted bail to five persons including MP Mithun Reddy in Punganur riots case


  • ఎంపీ మిథున్‌రెడ్డికి హైకోర్టులో ఊరట..

  • పుంగనూరు అల్లర్ల కేసులో ముందస్తు బెయిల్ మంజూరు..

  • 2 కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ హై కోర్టుకు వైసీపీ ఎంపీ..

  • మిథున్ రెడ్డితో సహా ఐదుగురికి ముందస్తు బెయిల్ మంజూరు..
Punganur Case: హైకోర్టులో ఎంపీ మిథున్‌రెడ్డికి ఊరట..

Punganur Case: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజంపేట లోక్‌సభ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఊరట లభించింది.. పుంగనూరు అల్లర్ల కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.. రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ హై కోర్టును ఆశ్రయించారు ఎంపీ మిథున్ రెడ్డి.. అయితే, ఈ రెండు కేసుల్లో ఎంపీ మిథున్ రెడ్డితో సహా ఐదుగురికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది ఏపీ హైకోర్టు.. ఇక, వారిపై ఎలాంటి చర్యలకు పూనుకోవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది..

కాగా, పుంగనూరులో ఎంపీ మిథున్‌ రెడ్డి పర్యటనతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం విదితమే.. పరస్పరం దాడులతో పుంగనూరులో విధ్వంసమే జరిగింది.. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల ఫిర్యాదుతో ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్పతో పాటు మరికొంతమంది వైసీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు అయ్యాయి.. మరో ఫిర్యాదుతో మిథున్ రెడ్డి, రెడ్డప్పలపై సెక్షన్‌ 307తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు వైసీపీ నేతల ఫిర్యాదులతో టీడీపీ శ్రేణులపై కూడా కేసులు నమోదు చేసిన విషయం విదితమే.. పుంగనూరు పోలీసులు జులై 19 హత్యాయత్నం సహా రెండు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. జులై 18వ తేదీన పుంగనూరును కుదిపేసిన ఘటన నేపథ్యంలో ఈ కేసులు పెట్టారు.. రెడ్డప్ప నివాసానికి మిథున్ రెడ్డి వచ్చిన సమయంలో కూటమి మరియు వైసీపీ క్యాడర్ మధ్య ఘర్షణలు చెలరేగాయి.. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు సిబ్బందితో సహా 12 మందికి పైగా గాయాలపాలయ్యారు.. అనేక వాహనాలు ధ్వంసమైన విషయం విదితమే..