Leading News Portal in Telugu

AP Cabinet Meeting Will Be Held On November 6th


  • నవంబర్ 6వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం..

  • నవంబర్ 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ఏపీ సర్కార్..

  • నవంబర్ 12న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం..

  • వారం రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ఏపీ ప్రభుత్వం..
AP Cabinet: నవంబర్ 6న ఏపీ కేబినెట్ భేటీ.. 12న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం

AP Cabinet: నవంబర్‌ 6వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. అదే రోజు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు భేటీ కానున్నారు. అమరావతిలో గల సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. సీతాకాల అసెంబ్లీ సమావేశాలపై ప్రధానంగా చర్చించనున్నారని తెలుస్తుంది. నవంబర్ 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ఏపీ సర్కార్ యోచిస్తున్నట్లుంది.

అలాగే, రాష్ట్రంలో పూర్తి స్థాయి బడ్జెట్‌పైనా మంత్రులు ఈ కేబినెట్ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇప్పటికే బడ్జెట్‌పై కసరత్తులు కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడితో పాటు ఆర్థిక శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. నవంబర్ 12వ తేదన అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. దీంతో పాటు రాష్ట్ర అభివృద్ధితో పాటు పలు కంపెనీలకు సంబంధించిన ఆహ్వానాలపైనా ఈ మంత్రి వర్గ భేటీలో మంత్రులు చర్చించనున్నారు. పలు నిర్ణయాలకు మంత్రులు ఆమోదం తెలపనున్నారు.