- ఆచార్య నాగార్జున వర్సిటీకి జప్తు నోటీసులు జారీచేసిన ఈఎస్‍ఐ..
-
ఉద్యోగుల ఈఎస్‍ఐ సొమ్ము దారిమళ్లడంపై నోటీసులు.. -
ఉద్యోగుల ఈఎస్‍ఐ సొమ్ము వాడుకున్న ఔట్ సోర్సింగ్ సంస్థ..

ESI Notices to Nagarjuna University: గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ఈఎస్ఐ అధికారులు నోటీసులు జారీ చేశారు… 2013లో జరిగిన పీఎఫ్ నిధుల గోల్‌మాల్ వ్యవహారంలో, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని, రెండు నెలల క్రితం యూనివర్సిటీ అధికారులకు ఈఎస్ఐ అధికారులు నోటీసులు పంపించారు.. దానికి యూనివర్సిటీ నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడంతో మీ అకౌంట్‌లు ఎందుకు సీజ్ చేయకూడదో చెప్పాలని ఈఎస్ఐ అధికారులు మరోసారి యూనివర్సిటీకి నోటీసులు పంపించారు. బాధితులకు డబ్బులు ఇచ్చే వరకు, యూనివర్సిటీ ఎకౌంట్‌లపై చర్యలు తీసుకుంటామని ఈఎస్ఐ నోటీసులు జారీ చేసింది.
అయితే, 2013లో జరిగిన నిధులు గోల్‌మాల్ వ్యవహారంపై మాజీ రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ జరిపించారని, ఆ కమిటీ విచారణ సందర్భంగా.. కాంట్రాక్టర్ బాధితులకు డబ్బు తిరిగి చెల్లించారని, అప్పటి విషయాన్ని న్యాయమూర్తి సమక్షంలోనే పరిష్కరించుకున్నారని అంటున్నారు.. యూనివర్సిటీ అధికారులు.. తాజాగా, ఈఎస్ఐ నోటీసులు జారీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ ఇతర యూనివర్సిటీలో నిధులు గోల్‌మాల్ చేస్తే, ఆచార్య నాగార్జున ఎలా యూనివర్సిటీకి ఎలా సంబంధం ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలతో యూనివర్సిటీ వ్యవహారాలు హాట్ హాట్ గా మారిపోయింది..