Leading News Portal in Telugu

Happy Diwali to Telugu people: Minister Atchannaidu


  • ఈ దీపావళి రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకం..

  • ఐదేళ్ల అవినీతి చీకట్లు తొలగించిన నవ్యాంధ్ర ప్రజలందరికీ ఈ దీపావళి ప్రత్యేకమైంది..

  • ప్రతి పేద వారి ఇంటా దీపం పథకాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషం: అచ్చెన్నాయుడు
Atchannaidu: ఐదేళ్ల అవినీతి చీకట్లు తొలగించిన నవ్యాంధ్ర ప్రజలకీ ఈ దీపావళి ఎంతో ప్రత్యేకమైంది..

Atchannaidu: ఐదేళ్ల అవినీతి చీకట్లు తొలగించిన నవ్యాంధ్ర ప్రజలందరికీ ఈ దీపావళి పండుగ ఎంతో ప్రత్యేకమైనది అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. అవినీతి, అరాచక పాలనతో ఏర్పడిన చీకట్లను తొలగించి నవ్యాంధ్రప్రదేశ్ లో అభివృద్ధి వెలుగులకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు.. గ్రామాల్లో తిరిగి ప్రారంభమైన అభివృద్ధి పనులతో.. రాష్ట్రానికి వస్తున్న నూతన ప్రాజెక్టులు, సమగ్ర అభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో ఐదేళ్ల తర్వాత రాష్ట్రంలో నిజమైన దీపావళి పండుగ వాతావరణం ఏర్పడింది అని ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి పేద వాడి ఇంటా పండుగ జరగాలనే తలంపుతో ఈ దీపావళి పండుగ కానుకగా దీపం పథకాన్ని శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది.. ఇక, దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో శుభం కలుగచేయాలని ఆకాంక్షిస్తూ తెలుగు ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు అని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.