Leading News Portal in Telugu

Fire Accident In SBI At Vishakha Jail Road in Visakhapatnam


  • విశాఖపట్నంలో అగ్ని ప్రమాదం..

  • జైలు రోడ్డులో ఉన్న SBI మెయిన్ బ్రాంచ్ లో ఘటన..

  • అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు..
Fire Accident In SBI: ఎస్బీఐ మెయిన్‌ బ్రాంచ్‌లో అన్నిప్రమాదం.. ఘటనపై అనుమానాలు..!

Fire Accident In SBI: విశాఖపట్నంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. జైలు రోడ్డులో ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) మెయిన్ బ్రాంచ్ లో ఈ రోజు ఉదయం 8 గంటల సమయంలో మంటలు మంటలు చెలరేగాయి.. వెంటనే స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.. అయితే, అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ ప్రధాన కారణంగా ప్రాథమికంగా భావిస్తున్నారు.. మొత్తం 3 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.. మంటల్లో కంప్యూటర్లు, విలువైన డాక్యుమెంట్లు కాలి పోయాయి.. దీపావళి సెలవురోజు కావడంతో సిబ్బంది కూడా ఎవరు లేకపోవడం.. మంటలు చెలరేగడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. అయితే, పూర్తి స్థాయిలో విచారణ జరిపాక అగ్ని ప్రమాదంపై వివరణ ఇస్తామంటున్నారు అధికారులు.. మరోవైపు.. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది.. అసలు అగ్నిప్రమాదం ఎలా సంభవించింది..? కారణం ఏంటి? కుట్ర కోణం ఏదైనా ఉందా? వంటి కోణాల్లో విచారణ చేపట్టారట పోలీసులు..