Leading News Portal in Telugu

YS Jagan left Bangalore in a special helicopter from Idupulapaya


  • కడప జిల్లాలో ముగిసిన వైఎస్ జగన్ పర్యటన..

  • ప్రత్యేక హెలికాప్టర్‌లో బెంగళూరు బయల్దేరిన జగన్..

  • వాతావరణం అనుకూలించకపోవడంతో జగన్‌ ప్రయాణం కాస్త ఆలస్యం..
YS Jagan: ప్రత్యేక హెలికాప్టర్‌లో బెంగళూరుకు జగన్‌.. వాతావరణం అనుకూలించక ఆలస్యంగా అనుమతులు..!

YS Jagan: కడప జిల్లా పర్యటన ముగించుకుని ప్రత్యేక హెలికాప్టర్‌లో బెంగళూరు బయల్దేరి వెళ్లారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్.. జిల్లాలో మూడు రోజుల పర్యటనలో బిజీ బిజీగా గడిపారు జగన్… జమ్మలమడుగు, కడప నియోజకవర్గాలకు సంబంధించిన నేతల మధ్య ఉన్న విభేదాలపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. అయితే, ఈ రోజు ఉదయమే బెంగళూరు వెళ్లాల్సి ఉండగా.. ఉదయం నుంచి దట్టమైన పొగమంచు కారణంగా మాజీ సీఎం హెలికాప్టర్ కు ఎయిర్ కంట్రోల్ నుంచి అనుమతులు త్వరగా రాలేదు.. వాతావరణం అనుకూలించకపోవడంతో జగన్‌ బెంగళూరు ప్రయాణం కాస్త ఆలస్యంగా ప్రారంభం అయ్యింది..

ఇక, మొదటిరోజు సాయంత్రం వరకు జమ్మలమడుగు ఇంఛార్జ్‌ వ్యవహారంపై సుదీర్ఘంగా జిల్లా నేతలతో పాటు జమ్మలమడుగు నేతలతో ఆయన చర్చించారు వైఎస్‌ జనగ్‌.. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి మధ్య కుదిరించడానికి కృషి చేశారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మూడు మండలాలు ,ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి మూడు మండలాలు ఇన్చార్జిగా ఉండాలని ఆయన ఆదేశించారు. రెండవ రోజు పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు ప్రజా సమస్యలను సానుకూలంగా విని అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మూడవరోజు తెల్లవారుజామునే పులివెందుల నుంచి ఇరుగులపై చేరుకొని మరో మారు జమ్మలమడుగు నేతలతో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు కలిసికట్టుగా పని చేయాలని పార్టీ క్యాడర్ కు ఆయన ఆదేశించారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్ లో బెంగళూరు బయలుదేరి వెళ్లారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌.