- జగన్ కు ఘాటు కౌంటర్ ఇచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు .
- అబద్ధాల్లో జగన్ కి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చని
- పోలవరం ఎత్తుపై తప్పుడు ప్రచారం మానుకోమని..

Nimmala Rama Naidu: సోషల్ మీడియా వేదికగా మంత్రి నిమ్మల రామానాయుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఇందులో భాగంగా.. అబద్ధాల్లో జగన్ కి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చని, పోలవరం ఎత్తుపై తప్పుడు ప్రచారం మానుకోమని ఆయన ఆన్నారు. కన్నతల్లిని తోడబుట్టిన చెల్లిని మోసం చేసి జగన్ చిత్కారానికి గురయ్యాడని, ప్రపంచ చరిత్ర తిరగేస్తే తల్లిని, చెల్లిని మోసం చేసిన వంటి దౌర్భాగ్య రాజకీయవేత్త ఎక్కడా కనిపించడు ఇతను తప్ప అంటూ తెలిపారు.
ప్రజా జీవనంలో ఉండడానికి అర్హత లేదన్న విషయం జగన్ కు అర్థం అయిపోయిందని, అందుచేతనే డైవర్షన్ పోలిటిక్స్ కు తెర లేపాడు అంటూ పేర్కొన్నారు. పోలవరం ఎత్తుపై అతని చెత్త మీడియాలో అబద్ధాలు అచ్చు వేసి గడిచిన రెండు రోజులుగా దుష్ప్రచారం చేస్తున్నాడని.. దానికి నేను పూర్తి వివరాలతో జగన్ పోలవరం ప్రాజెక్టుకు చేసిన ద్రోహం గురించి వివరించా అంటూ తెలిపారు. అయినా అతని బుద్ధి మారలేదు. రాష్ట్రానికి జల ద్రోహం చేసింది జగన్ కుటుంబమే. నాడు జల యజ్ఞం పేరిట ధనయజ్ఞం చేశారు. కృష్ణ మిగులు జలాల్లో హక్కు కోరబోమని బ్రిజెష్ కుమార్ ట్రిబ్యునల్ కు లేఖ రాసి ఇచ్చి ద్రోహం చేశారాణి ఆయన ఆరోపించారు.
పోలవరం రివర్స్ టెండరింగ్ పేరుతో 15 నెలలు ఆలస్యం చేసి డయాఫ్రమ్ వాల్ విధ్వంసానికి కారుకులయ్యారని, ఇసుక మాఫియాతో అన్నమయ్య డ్యాంను కూలగొట్టి 38 మంది ప్రాణాలు పోగొట్టాడని ఆయన అన్నారు. పులిచింతల, గుళ్ళకమ్మ గేట్లు కొట్టుకుపోవడం జగన్ పాపం కాదా అంటూ… పోలవరానికి కేంద్రం ఇచ్చిన రూ. 3800 కోట్లు దారి మళ్లించి నదుల అనుసంధానానికి గండి కొట్టాడని అన్నారు. పోలవరం ఎత్తు తగ్గించడానికి రెండు పేజ్ లుగా విభజించింది జగన్ కాదా.. కేంద్రాన్ని 41.15 మీటర్లకు తగ్గించి అనుమతి కోరింది జగన్ కాదా.. మా ఎన్డీఏ ప్రభుత్వం పోలవరం ఎత్తు 45.72 మీటర్లు పెంచి నదుల అనుసంధానం చేసి సస్యశ్యామల ఆంధ్రప్రదేశ్ గా ఆవిర్భవింప చేస్తామని ఆయన అన్నారు. ఇప్పటికైనా అబద్ధాలు మాని నీ కుటుంబ కలహాల్ని చక్కబెట్టుకో.. ఇది నీ హితువు కోరి చెబుతున్నా అని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నాడు.