Leading News Portal in Telugu

AP CM Chandrababu Tweet about BPL founder TPG Nambiar Death


  • బీపీఎల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ నంబియార్‌ మృతి
  • నంబియార్‌ మృతి పట్ల సీఎం‌ చంద్రబాబు సంతాపం
  • టెలివిజన్‌ మార్కెట్‌లో బీపీఎల్‌ ఓ బ్రాండ్
CM Chandrababu: నంబియార్‌ మృతి పట్ల సీఎం‌ చంద్రబాబు సంతాపం!

బీపీఎల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ టీపీ గోపాలన్‌ నంబియార్‌ మృతి పట్ల ఏపీ సీఎం‌ చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. భారతీయ ఎలక్ట్రానిక్స్‌కు మార్గదర్శకుడైన నంబియార్‌కు కోల్పయినందుకు తనకు చాలా బాధగా ఉందన్నారు. తన అద్భుత నాయకత్వంతో బీపీఎల్‌ను అందరి ప్రియమైన బ్రాండ్‌గా మార్చాడన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు అందించిన ఆయన సేవలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయని సీఎం‌ చంద్రబాబు ఎక్స్‌లో పేర్కొన్నారు.

‘బీపీఎల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌, భారతీయ ఎలక్ట్రానిక్స్‌కు మార్గదర్శకుడైన టీపీ గోపాలన్‌ నంబియార్‌ను కోల్పయినందుకు చాలా బాధగా ఉంది. తన దూరదృష్టితో కూడిన నాయకత్వంతో బీపీఎల్‌ను ప్రియమైన బ్రాండ్‌గా మార్చారు. భారతీయ గృహాలకు నాణ్యమైన సాంకేతికతను తీసుకువచ్చారు. భారతదేశ పరిశ్రమలలో, ఆర్ధిక వ్యవస్ధలో నంబియార్ పాత్ర మరువలేనిది. నంబియార్‌ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నా’ అని సీఎం‌ చంద్రబాబు ఎక్స్‌లో పేర్కొన్నారు.

ఒకప్పుడు టెలివిజన్‌ మార్కెట్‌లో బీపీఎల్‌ ఓ బ్రాండ్. టీవీలే కాకుండా.. ఫ్రిడ్జ్‌లు, వాషింగ్‌ మెషీన్లకు గుర్తింపు పొందింది. బీపీఎల్‌ను టీపీ గోపాలన్‌ నంబియార్‌ 1963లో నెలకొల్పారు. ఒక కంపెనీని స్థాపించడానికి అనుమతులు పొందడమే కష్టంగా ఉన్న ‘లైసెన్స్‌ రాజ్‌’ రోజుల్లో ఈ సంస్థను స్థాపించడం విశేషం. ముందుగా కేరళలోని పాలక్కడ్‌లో బీపీఎల్‌ తయారీ కేంద్రాన్ని నెలకొల్పి.. అనంతరం బెంగళూరుకు మార్చారు. 1990ల్లో బీపీఎల్‌దే హవా. అయితే ఎల్‌జీ, శాంసంగ్ ప్రవేశంతో బీపీఎల్‌ హవా తగ్గింది.