Leading News Portal in Telugu

AP News: Road Accidents Today in AP


  • శ్రీకాకుళంలో రోడ్డు ప్రమాదం
  • కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా
  • పశ్చిమ గోదావరి జిల్లాలో కారు బీభత్సం
Road Accident: కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. 12 మందికి గాయాలు!

శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటో.. కంచిలి మండలం బారువా సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మందికి గాయాలు అయ్యాయి. నలుగురు కూలీలకు తీవ్ర గాయాలు కాగా.. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంకు చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఆటో అదుపు తప్పడం వలనే ఈ ప్రమాదం జరిగుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇస్సకోడేరులో జాతీయ రహదారిపై కారు బీభత్సం స్టూష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు.. ఏకంగా ఐదు బైక్‌లను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలు అయ్యాయి. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు.

కాకినాడ జిల్లా తొండంగి మండలం రావికంపాడు జాతీయ రహదారి వద్ద ఈరోజు తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విజయనగరం జోన్ 1 ఈడీ బ్రహ్మానంద రెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి. బ్రహ్మానంద రెడ్డి విజయవాడ నుంచి విజయనగరంకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా డివైడర్‌ను ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ముందుగా తునిలో ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా.. ఆపై మెరుగైన చికిత్స కోసం విశాఖకు తరలించారు.