- ఏలూరు జిల్లా ద్వారక తిరుమల మండలం ఐఎస్ జగన్నాధపురంలో బహిరంగ సభ
-
పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా అభిమానులు OG..OG అంటూ కేకలు -
సినిమా పేర్లు జపించడం కంటే భగవన్నామస్మరణ చేస్తే బాగుంటుంది- పవన్ -
సినిమాలు ఒక సరదా మాత్రమే.. సినిమాలు ఉండాలి- పవన్ కళ్యాణ్.

ఏలూరు జిల్లా ద్వారక తిరుమల మండలం ఐఎస్ జగన్నాధపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీపం పథకం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తుండగా.. ఆయన అభిమానులు OG..OG అంటూ కేకలు వేశారు. దీంతో పవన్ మాట్లాడుతూ.. సినిమా పేర్లు జపించడం కంటే భగవన్నామస్మరణ చేస్తే బాగుంటుందని అభిమానులకు సూచించారు. సినిమాలు ఒక సరదా మాత్రమే.. కానీ సినిమాలు కూడా ఉండాలని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
కాగా.. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో పవన్‌ను సుజీత్ చాలా స్టైలిష్ లుక్‌లో చూపించడంతో పాటు, పాన్ ఇండియా రేంజ్‌లో ఆకట్టుకునే విధంగా కథ, కథనంను ప్లాన్ చేస్తున్నారనే తెలుస్తోంది. ఓ పక్క రాజకీయాల్లో బిజీగా ఉన్నా.. చిత్ర షూటింగ్‌లో పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు. ఈ సినిమా 2025లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ భావిస్తున్నారు.